News February 13, 2025
‘భీముని కొలను’ గురించి తెలుసా?

పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. లోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
వనపర్తి: నామినేషన్కు ముందు కొత్త ఖాతా తప్పనిసరి: శ్రీనివాసులు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు తమ పేరు మీద కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని, ఎన్నికల వ్యయం మొత్తాన్ని దీని ద్వారానే చేయాలని వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు తెలిపారు. నామినేషన్ సమయంలో ఇచ్చే ఎక్స్పెండీచర్ బుక్లో ప్రతి ఖర్చును నమోదు చేయాలని సూచించారు. 15 రోజులకు ఒకసారి ఆ వివరాలను నోడల్ అధికారికి చూపించి సంతకం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.


