News November 8, 2024
భీమ్‌గల్లో విషాదం.. ఇంటిపై నుంచి పడి రెండేళ్ల పాప మృతి
భీమ్‌గల్ పట్టణంలో గురువారం విషాదం నెలకొంది. మోయిజ ఆనం అనే రెండేళ్ల చిన్నారి ఇంటి దాబాపై నుంచి పడి మరణించింది. నందిగల్లిలో చిన్నారి తన ఇంటి దాబాపై ఆడుకుంటుండగా.. దానికి పిట్ట గోడ లేనందున ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. దీంతో తలకు తీవ్ర గాయాలు అయి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు .
Similar News
News December 6, 2024
NZB: బాలికపై లైంగిక దాడి.. ఇద్దరి రిమాండ్
బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిని, అతడికి సహకరించిన మరొకరిని రిమాండ్‌కు తరలించినట్లు డిచ్పల్లి CI మల్లేశ్ తెలిపారు. అక్టోబర్ 1న జక్రాన్‌పల్లికి చెందిన యువకుడు ఓ బాలికను నమ్మించి నిర్మల్‌లోని వెంకటసాయి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 31న అజయ్‌ని అరెస్ట్ చేశారు. కాగా లాడ్జ్ మేనేజర్ సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసినట్లు CI వెల్లడించారు.
News December 6, 2024
పిట్లం: ప్రాణాలంటే మరీ ఇంత నిర్లక్ష్యమా..!
పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలించవద్దని అధికారులు పదే పదే చెపుతున్నా..కొందరు వాహనదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు పై చిత్రమే నిదర్శనం. ఇలా ప్రయాణించే పలువురు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేకం ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఓ తుఫాన్ టాప్‌పై ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృష్యామిది.
News December 6, 2024
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తాం:చైర్మన్
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ డేడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు వెల్లడించారు. గురువారం నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా బీసీల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉండాలనే అంశంపై ఎక్కువ మంది వారి విజ్ఞాపనలు అందించారని తెలిపారు.