News September 16, 2024

భీమ్‌గల్: ఆటో బోల్తా.. బాలుడి మృతి

image

భీమ్‌గల్ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్ నుంచి సంతోశ్‌నగర్ తండాకు 5గురు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా రియాన్ అనే బాలుడి తలకు గాయమైంది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Similar News

News October 14, 2025

నిజామాబాద్: రైతుల బాగోగులు ప్రభుత్వానికి అవసరం లేదు: బీజేపీ

image

రైతుల బాగోగుల గురించి ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మండిపడ్డారు. 80 లక్షల టన్నుల పంటను కొనడానికి సిద్ధం అని బీరాలు పలికి, కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించారన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభాన్ని తాత్సారం చేస్తున్నారు. రైతులకు మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరారు.

News October 14, 2025

నిజామాబాద్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

image

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మ నాయక్ తెలిపారు. మంగళవారం గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించడం మన బాధ్యతగా గుర్తించాలన్నారు. పర్యావరణం, ప్రగతిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

News October 14, 2025

SRSP అప్డేట్.. 4గేట్ల ద్వారా నీటి విడుదల

image

SRSP ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 22,290 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా 4 గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయకు 5000, ఎస్కేప్ గేట్లు (రివర్) 3000, సరస్వతి కాలువ 650, లక్ష్మి 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు తగ్గుతోంది. నీటిమట్టం 1091 అడుగులు కాగా 80.501TMC నీరు ఉంది.