News March 23, 2025
భీమ్‌గల్: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. యువకుడిపై కేసు

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు భీమ్‌గల్‌లో శనివారం జరిగింది. ఎస్ఐ మహేశ్ ప్రకారం.. మండలానికి చెందిన అక్షయ్ ఇంటి పక్కన నివసిస్తున్న బాలికను తన ఇంట్లోకి లాక్కెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెపారు. మైనర్ కావడంతో ఆర్మూర్ ACP వెంకటేశ్వర్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News April 22, 2025
UPDATE: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎంతమంది పాసంటే?

ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,035 మంది ఉత్తీర్ణులు అయినట్లు DIEO తెలిపారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా 1,223 ఉత్తీర్ణులయ్యారని వివరించారు.
News April 22, 2025
UPDATE: రెండో సంవత్సరంలో 5309 మంది బాలికలు పాస్

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం జనరల్ కోర్సులలో మొత్తం విద్యార్థులు 13,945 మంది హాజరు కాగా వీరిలో 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలికలు 7,657 మంది హాజరు కాగా 5,309 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,288 మంది పరీక్షలు రాయగా 2,808 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం ఒకేషనల్‌లో మొత్తం 2,042 మంది విద్యార్థులు హాజరుకాగా 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
News April 22, 2025
INTER RESULTS: 32వ స్థానంలో నిజామాబాద్

ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు నిరాశపరిచారు. మొదటి సంవత్సరం ఫలితాలలో 51.88 ఉత్తీర్ణతతో 27వ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 58.47 శాతం ఉత్తీర్ణతతో 32వ స్థానానికి పరిమితమయ్యారు.