News February 27, 2025

భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

image

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు SI వివరించారు.

Similar News

News November 19, 2025

3.11 లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరలు: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన 3,11,922 మంది మహిళలు చీరలకు అర్హులని తెలిపారు. వివాదాలకు తావు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, దీని కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించామని కలెక్టర్ పేర్కొన్నారు.

News November 19, 2025

సిద్దిపేట: నిరంతరం కృషిచేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

image

శాస్త్రీయ విజ్ఞానంపై నిరంతరం కృషిచేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ప్రేరణ, బాల వైజ్ఞానిక ప్రదర్శినను నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్, ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, గ్రంథాలయ ఛైర్మన్ లింగమూర్తి హజరయ్యారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో 183 ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించారు.

News November 19, 2025

కరప: రూ.1.48 లక్షలు డ్రా చేశారంటూ ఫిర్యాదు

image

కరపకు చెందిన ఓ మీడియా ప్రతినిధి బ్యాంక్ ఖాతా నుంచి బుధవారం రూ.1.48 లక్షలు కేటుగాళ్లు డ్రా చేశారు. ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా, ఈ మొత్తాన్ని డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో ఆందోళన చెంది, వెంటనే క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇలా సొమ్ములను కాజేస్తున్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.