News January 23, 2025
భువనగిరికి మంత్రి తుమ్మల రాక

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరికి రానున్నారు. భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. తుమ్మలతో పాటు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరవుతారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
Similar News
News December 17, 2025
పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో

ఇండిగో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ ట్రైనింగ్, కెప్టెన్ అప్గ్రేడ్లను వేగవంతం చేయాలని నిర్ణయించింది. గతంలో నెలకు 35-40 మందిని కెప్టెన్లుగా ప్రమోట్ చేసిన సంస్థ, ఈ ఏడాది 10-12 మందికే పరిమితమైంది. ఇక జనవరి నుంచి మళ్లీ పూర్తి స్థాయిలో అప్గ్రేడ్లు ప్రారంభించనుంది. అయితే కొత్త కెప్టెన్లు 18-24 నెలల పాటు వేరే బేస్‌లో పనిచేయాలి. మధ్యలో వెళ్లిపోతే రూ.20-30 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
News December 17, 2025
లింగసముద్రం: గుండెపోటుతో హోంగార్డు మృతి

లింగసముద్రం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొండలరావు గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి బైక్‌పై విధి నిర్వహణకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
News December 17, 2025
కృష్ణా: గొబ్బెమ్మల పూజలతో గ్రామాల్లో సంక్రాంతి సందడి షురూ

ధనుర్మాసం ప్రారంభమవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలైంది. మహిళలు మంచును సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే ఆవు పేడతో సంప్రదాయ గొబ్బెమ్మలు తయారు చేసి, గృహాల ముందు ఏర్పాటు చేస్తున్నారు. రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలతో గొబ్బెమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుండడంతో గ్రామాలు కళకళలాడుతున్నాయి.


