News February 9, 2025
భువనగిరిలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

భువనగిరిలో ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని హనుమన్వాడ, సంజీవ్ నగర్, పహాడీ నగర్లలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సీఐ సురేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు ప్రజలకు అందించే సేవలను వివరించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 16, 2025
కురుమూర్తి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం శివారులోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ మేరకు శ్రీ కురుమూర్తి దేవస్థాన ఛైర్మన్ జి.గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఆహ్వన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2025
నవంబర్లో లండన్ పర్యటనకు CM చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్లో పర్యటించనున్నారు. విశాఖలో వచ్చేనెల 14, 15న జరగనున్న సీఐఐ సదస్సుకు రావాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగనుంది.
News October 16, 2025
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, పూర్తయిన వాటి వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ దశ వరకు పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులను బిల్లుల గురించి అడిగి, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.