News February 9, 2025
భువనగిరిలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

భువనగిరిలో ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువ కావాలన్న ఆలోచనతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని హనుమన్వాడ, సంజీవ్ నగర్, పహాడీ నగర్లలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సీఐ సురేశ్ కుమార్ తెలిపారు. పోలీసులు ప్రజలకు అందించే సేవలను వివరించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
HYD: వామ్మో.. ఏంటీ పరిస్థితి..!

గ్రేటర్ HYDలో అనేక ప్రాంతాల్లో దోమల బెడద ఉన్నట్లు GHMC దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఖైరతాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ అన్సారి ట్వీట్ గ్రేటర్ పరిస్థితికి అద్దం పడుతోంది. దోమలను చంపేసి తన ఇంటి ఫ్లోర్‌పై ఏకంగా కుప్పలు తెప్పలుగా ఉంచిన ఫోటోను అధికారులకు చూపుతూ, ఏంటి ఈ పరిస్థితి..? ఇలా అయితే విష జ్వరాలు సోకే అవకాశం ఉందన్నారు. మరి మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది. GHMC చర్యలపై మీ కామెంట్.
News March 28, 2025
Stock Markets: ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ మినహా…

స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యాయి. నిఫ్టీ 23,519 (-72), సెన్సెక్స్ 77,414 (-191) వద్ద ముగిశాయి. FMCG, ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. మీడియా, ఐటీ, రియాల్టి, ఆటో, మెటల్, ఫార్మా, కమోడిటీస్, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్, ఎనర్జీ షేర్లు ఎరుపెక్కాయి. టాటా కన్జూమర్, కొటక్ బ్యాంకు, అపోలో హాస్పిటల్స్, ONGC, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్. విప్రో, ఇండస్‌ఇండ్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా టాప్ లూజర్స్.
News March 28, 2025
విశాఖ: అన్నయ్య మందలించడంతో సూసైడ్

అన్నయ్య మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జై భారత్ నగర్‌లో ప్రతాప్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రతాప్ శుక్రవారం డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆయన అన్నయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.