News February 6, 2026

భువనగిరి: అంతిమయాత్రలో మున్సిపల్ ఓట్ల వేట..!

image

ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. భువనగిరి మున్సిపాలిటీ 32వ వార్డు తారకరామనగర్‌కు వార్డుకు చెందిన పులి సంపత్ మృతి చెందగా.. ఆయన అంత్యక్రియల్లో రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యారు. కాంగ్రెస్‌, BRS, BJP సహా స్వతంత్ర అభ్యర్థుల బంధువులు, వారి భర్తలు విభేదాలను పక్కనబెట్టి కలిసి పాడె మోశారు. ఓట్ల వేటలో భాగంగా అభ్యర్థుల తరపున ప్రచారంలో ఉన్న వారంతా ఇలా కలిసి నడవటం చర్చనీయాంశమైంది.

Similar News

News April 20, 2026

@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

image

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.

News April 20, 2026

NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

image

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.

News April 20, 2026

సేంద్రియ మేళా సూపర్‌ హిట్: కలెక్టర్

image

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.