News January 31, 2025

భువనగిరి: అడవి దున్న కోసం గాలింపు 

image

ఆత్మకూరు (ఎం) మండలం పల్లెర్ల శివారులోకి <<15313887>>అడవి దున్నపోతు<<>> వచ్చిన విషయం తెలిసిందే. గురువారం నుంచి రాత్రింబవళ్లు ఫారెస్ట్ అధికారులు అడవి దున్న కోసం వెతుకుతున్నారు. డ్రోన్ సహాయంతో మొత్తం 25 మంది ఫారెస్ట్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అడవిదున్నను అటవీ ప్రాంతానికి తరలిస్తామన్నారు.

Similar News

News September 19, 2025

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో భాద్రపద మాసం శుక్రవారం వారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు దర్శనమిచ్చారు. శుక్రవారం భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులున్నారు.

News September 19, 2025

తెరపైకి బూచేపల్లి.. అసలేం జరుగుతోంది?

image

మద్యం కుంభకోణం కేసు గురించి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒంగోలు వైసీపీ MP అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దర్శి MLA బూచేపల్లి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉదంటూ సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. డబ్బులు బూచేపల్లికి చేరాయని ఆరోపిస్తుండగా.. నిజంగా ఆయన పాత్ర ఉందా? లేక కావాలనే చేర్చారా? అనేది తేలాల్సి ఉంది.

News September 19, 2025

NLG: బిల్లులు ఇప్పించండి మహాప్రభో..!

image

నల్గొండ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఏటేటా ఈ బకాయిలు పెరిగి ఇప్పటివరకు సుమారుగా రూ.6.81 కోట్ల పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు మూడేళ్లుగా బిల్లులు అందక ఆందోళన చెందుతున్నారు. 2022-23 నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆయా పాఠశాలల యాజమాన్యాలు తెలిపాయి.