News May 3, 2024

భువనగిరి: ఆన్లైన్ మోసం.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

image

భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో ఓ వ్యక్తి ఆన్లైన్ మోసానికి గురయ్యాడు. గుర్తుతెలియని ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు అనే లింక్‌ను వాట్సాప్‌లో పంపగా ఆ లింకును ఓపెన్ చేయగానే అతని అకౌంట్లో నుంచి సుమారు లక్ష రూపాయల నగదు కట్టయ్యాయని దీంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News December 28, 2024

NLG: డిగ్రీ విద్యార్థులకు ఇదే చివరి అవకాశం!

image

MG యూనివర్సిటీ పరిధిలోని వార్షిక, సెమిస్టర్ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు చివరి అవకాశం కల్పిస్తూ పరీక్షలను నిర్వహించనున్నట్లు సీఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2011-2016 వరకు విద్య వార్షిక సంవత్సరాలలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కొరకు పరీక్ష ఫీజును 12 ఫిబ్రవరి 2025 వరకు లోపు చెల్లించి పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.

News December 28, 2024

NLG: నిఘా నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్ 

image

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిఘానీడలో నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగశాలల్లో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, దానికి కావాల్సిన ప్రతిపాదనలను వెంటనే బోర్డుకు పంపాలని ఈ నెల 23న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 290 ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కళాశాలలో ఫిబ్రవరి మొదటివారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి.

News December 28, 2024

NLG: ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకుని మృతి

image

ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకుని యువకుడు మృతి చెందిన ఘటన గుర్రంపోడు మండలంలో జరిగింది.  గ్రామస్థులు తెలిపిన వివరాలిలా.. మక్కపల్లికి చెందిన నేతాళ్ల కిరణ్ (15) బ్రష్ చేసుకుంటూ డాబా ఎక్కాడు. ఫోన్ రావడంతో మాట్లాడుతూ విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కిరణ్  కొండమల్లేపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.