News January 31, 2025

భువనగిరి: ఇవాల్టి నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ 

image

ఇంటర్ విద్యార్థులకు ఇవాల్టి నుంచి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 64 జూనియర్ కాలేజీలుండగా 14,400 మంది విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ఆంగ్లంపై భయాన్ని తొలగించాలనే ఉద్దేశంతో విద్యార్థులు నిమిషం పాటు ఇంగ్లిష్ మాట్లాడాలనే నిబంధన పెట్టారు. తమకిష్టమైన ఏదో ఒక అంశంపై మాట్లాడే అవకాశం కల్పించినట్లు విద్యా అధికారులు చెప్పారు. 

Similar News

News November 25, 2025

జనగామ జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు

image

జనగామ జిల్లాలోని 280 పంచాయతీలు, 2534 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో చిల్పూరు, ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, లింగాల ఘనపురంలోని 110 జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2వ దశలో జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేటలోని 79 జీపీలకు, 3వ దశలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకొండ్లలోని 91 పంచాయతీలకు జరుగనున్నాయి.

News November 25, 2025

12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

image

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.

News November 25, 2025

మహబూబాబాద్ జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

image

మహబూబాబాద్ జిల్లాలోని 482 పంచాయతీలకు ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురులోని 155 పంచాయతీలకు నిర్వహించనున్నారు. 2వ దశలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్ద వంగర, తొర్రూర్‌లోని 158 పంచాయతీలకు నిర్వహించనున్నారు. 3వ దశలో డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి మరిపెడ, సీరోలు మండలాల్లోని 169 పంచాయతీలకు జరుగనున్నాయి.