News March 30, 2025
భువనగిరి: ఉగాది పచ్చడిలా జీవితం ఉండాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా.. జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Similar News
News October 31, 2025
ఒంటికొస్తే.. దర్జాగా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్లొచ్చు!

షాపింగ్స్ తదితర అవసరాల కోసం పట్టణాలకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో టాయిలెట్స్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ‘Sarais Act, 1867 Section 7(2)’ ప్రకారం దేశంలో ఫైవ్ స్టార్ హోటల్తో సహా ఏ హోటల్కైనా వెళ్లి టాయిలెట్స్ వాడుకునే హక్కు ఉందనే విషయం చాలామందికి తెలియదు. అలాగే అక్కడ నీరు తాగే హక్కు కూడా ఉంది. ప్రజల సౌకర్యం కోసం తీసుకొచ్చిన ఈ హక్కును అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. SHARE IT
News October 31, 2025
అందుకే బంగ్లాదేశ్ను వీడాను: షేక్ హసీనా

తప్పనిసరి పరిస్థితుల వల్లే దేశాన్ని వీడానని బంగ్లాదేశ్ Ex PM షేక్ హసీనా తెలిపారు. తాను అక్కడే ఉండుంటే తనతోపాటు చుట్టూ ఉన్న వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నా. ఆగస్టులో జరిగినది హింసాత్మక తిరుగుబాటు. బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నాకు మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అది బూటకపు విచారణ’ అని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.
News October 31, 2025
ప్రకృతి సేద్యం.. వరిలో ఆకుముడత, ఉల్లికోడు నివారణ

ప్రకృతి సేద్యం విధానంలో పండిస్తున్న వరిలో ఆకుముడత పురుగు నివారణకు తాడుతో మొక్కలపై లాగడం వల్ల ముడుచుకున్న ఆకులు తెరచుకొని పురుగులు కింద పడిపోతాయి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్(దీపపు ఎర)ను అమర్చుకోవాలి. 5% వేప కషాయం లేదా నీమాస్త్రం పంట తొలిదశలో ఎకరానికి 200 లీటర్లు పిచికారీ చేయాలి. ఉల్లికోడు నివారణకు ఎకరానికి ఒక దీపపు ఎరను అమర్చుకోవాలి. 200 లీటర్ల నీటిలో అగ్నాస్త్రం 5 లీటర్లను కలిపి పిచికారీ చేయాలి.


