News March 30, 2025

భువనగిరి: ఉగాది పచ్చడిలా జీవితం ఉండాలి: కలెక్టర్ 

image

జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా.. జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Similar News

News April 21, 2025

కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

image

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.

News April 21, 2025

నిజామాబాద్: తేలనున్న 36,222 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 21, 2025

బోథ్: భార్య తిట్టిందని భర్త సూసైడ్

image

బోథ్ మండలం నక్కలవాడకి చెందిన నైతం భూమన్న(35) అనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. పాలేరుగా పనిచేస్తున్న భూమన్న మద్యానికి బానిసయ్యాడు. ఆయన తరచూ భార్యతో గొడవపడేవాడు. రాత్రి అతిగా మద్యం తాగడంతో భార్య మందలించింది. క్షణికావేశంలో మోనోసిల్ తాగగా బంధువులు బోథ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవావారం మృతిచెందారు.

error: Content is protected !!