News December 28, 2024
భువనగిరి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే భువనగిరికి చెందిన రేవంత్ అమీర్ పేట్ లో టెక్నికల్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఔషాపూర్ సమీపంలో శిరిడి ఎక్స్ ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Similar News
News November 4, 2025
ధాన్యం సేకరణ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్

మండల ప్రత్యేక అధికారులు తమ ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ (KGBV) వంటి విద్యాసంస్థలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సమీక్షలో అధికారులకు సూచించారు.
News November 3, 2025
పోలీస్ గ్రీవెన్స్‌లో 45 ఫిర్యాదులు

పోలీస్ గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 45 మంది అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని, తక్షణమే సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
News November 3, 2025
చిట్యాల అండర్‌పాస్ వద్ద సమస్య పరిష్కారానికి ఎస్పీ పర్యవేక్షణ

జాతీయ రహదారి 65 పై చిట్యాల రైల్వే బ్రిడ్జి అండర్‌పాస్ వద్ద వర్షపు నీరు నిలిచి తీవ్ర ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.


