News December 28, 2024
భువనగిరి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే భువనగిరికి చెందిన రేవంత్ అమీర్ పేట్ లో టెక్నికల్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఔషాపూర్ సమీపంలో శిరిడి ఎక్స్ ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Similar News
News January 19, 2025
చెరువుగట్టు ఆలయ స్థల పురాణం ఇదే!
చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం <<15183553>>ప్రసిద్ధ శైవక్షేత్రంగా<<>> భాసిల్లుతోంది. పరశురాముడు వేల ఏళ్లు తపస్సు చేసినా ఎంతకీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడైన తన పరుశువుతో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడట. ఆ తర్వాతే శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులకు అనుగ్రహిస్తుంటానని చెప్పాడని స్థల పురాణం. పరశురాముడు కొట్టిన సమయంలోనే జడలుగా లింగాకారం ఏర్పడిందని భక్తుల నమ్మకం.
News January 19, 2025
పెరిగిన యాదగిరీశుడి నిత్య ఆదాయం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం 1500 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.75,000, ప్రసాద విక్రయాలు రూ.12,32,330, VIP దర్శనాలు రూ.6,75,000, బ్రేక్ దర్శనాలు రూ.2,58,600, కార్ పార్కింగ్ రూ.5,50,000, వ్రతాలు రూ.1,42,400, సువర్ణ పుష్పార్చన రూ.97,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.42,98,487 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.
News January 18, 2025
రేపు భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. ఉదయం 10.30 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.45 నిమిషాలకు భువనగిరి పట్టణానికి చేరుకుంటారు. అనంతరం మీనా నగర్ కాలనీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా పార్ధివ దేహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12:45కు బయలుదేరి 2గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.