News May 14, 2024

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌ ఫైనల్ ఓటింగ్ 76.78%

image

భువనగిరి లోక్‌సభ స్థానం పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. ఆలేరు- 82.81%, భువనగిరి- 82.71%, ఇబ్రహీంపట్నం- 66.83%, జనగాం-74.68%, మునుగోడు- 83.71%, నకిరేకల్ -77.11%, తుంగతుర్తి- 74.06%గా ఉంది. మొత్తంగా 76.78% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఇదే టాప్. కాగా ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి చామల కిరణ్, బీజేపీ నుంచి బూర నర్సయ్య , బీఆర్ఎస్ నుంచి మల్లేశ్ బరిలో ఉన్నారు.

Similar News

News November 17, 2024

నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి  

image

నల్లగొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన మెండే ప్రేమ్ – సునీతల కుమారుడు మెండే ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.

News November 17, 2024

NLG: నెలాఖరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

image

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవన నిర్మాణాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె SLBC కాలనీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని తనిఖీ చేశారు. టీజీ ఎస్ఎం ఐడీసీ చీఫ్ ఇంజనీర్ దేవేందర్ కుమార్ వైద్య కళాశాల భవన నిర్మాణ పనుల పరిస్థితిని వివరించారు.

News November 16, 2024

నల్గొండ: చేతికి వచ్చిన వరి పంట.. రైతుళ్లో ఆందోళన 

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చింది. ఆనందంగా ఉండాల్సిన అన్నదాతలు భయంభయంగా, ఆందోళన చెందుతున్నారు. మారుతున్న వాతవరణ పరిస్థితులే అందుకు కారణం. ఆరుగాళం కష్టపడి పండించిన పంట ఎక్కడ అందకుండా పోతుందేమో అనేదే వారి ఆందోళన.  వర్షాలు రాకూడదని, పంట చేతికందాలని అన్నదాతులు వరుణ దేవుడని ప్రార్థిస్తున్నారు.