News April 10, 2024
భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష

భువనగిరి ఎంపీ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. హైదరబాద్‌లోనిఎమ్మేల్యే రాజ్‌గోపాల్ రెడ్డి నివాసంలో చర్చించారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్, సామెల్, మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
Similar News
News March 6, 2026
నల్గొండలో భానుడి ప్రతాపం

నల్గొండ జిల్లాలో మార్చి మొదటి వారంలోనే ఎండలు ముదురుతున్నాయి. గత నెల 15 నుంచి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారం గరిష్ఠంగా 36.5 డిగ్రీలకు చేరాయి. మధ్యాహ్నం వేళ భానుడి సెగలకు జనం అల్లాడిపోతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
News March 6, 2026
డిజిటల్ క్రాప్ సర్వే.. వాలంటీర్లకు అద్భుత అవకాశం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వేలో వాలంటీర్లుగా పనిచేసేందుకు గ్రామీణ నిరుద్యోగ యువతకు అవకాశం లభించింది. జిల్లాలోని 12 లక్షల ఎకరాల్లో 5 లక్షల మంది రైతులు సాగు చేస్తున్న పంటల వివరాల సేకరణే ఈ సర్వే లక్ష్యం. ఇప్పటికే మెజారిటీ గ్రామాల్లో నియామకాలు పూర్తయ్యాయని, మిగిలిన ప్రాంతాల్లో ఆసక్తి గల యువకులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి (DAO) శ్రవణ్ కుమార్ కోరారు.
News March 6, 2026
మిల్లర్ల పిటిషన్ పై విచారణ 18కి వాయిదా

జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.191 కోట్ల ధాన్యం మాయం కేసులో మిల్లర్ల క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. జిల్లాలోని 7 మిల్లుల్లో సుమారు 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. తమపై నమోదైన కేసులు చెల్లవని, వాటిని కొట్టివేయాలని కోరుతూ ఐదు మిల్లుల నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.


