News February 26, 2025
భువనగిరి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.104 మంది పోలింగ్ సిబ్బందిని,17 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 214 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News February 26, 2025
ఎస్.రాయవరంలో శివరాత్రి రోజున విషాదం

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లులో శివరాత్రి రోజున విషాదం నెలకొంది. శివరాత్రి సందర్భంగా బుధవారం పెనుగొల్లు గ్రామంలో పక్కుర్తి చరణ్ (20) మరో యువకుడు స్నానానికి దిగారు. వీరికి ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా ఒక యువకుడిని రక్షించారు. అప్పటికే మునిగిపోయిన చరణ్‌ను బయటికి తీయగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
News February 26, 2025
మార్చి 1న ‘కన్నప్ప’ టీజర్!

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 1వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.
News February 26, 2025
ఏడుపాయల బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ

పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమాత వద్ద భారీ ఎత్తున జాతర ఉత్సవాల నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.