News March 18, 2025

భువనగిరి: కలెక్టరేట్‌ వద్ద మహిళల బస 

image

భువనగిరి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్, సీఐటీయూ ఆధ్వర్యంలో తమ సమస్యను పరిష్కరించాలని 48 గంటల పాటు మహాధర్నా చేస్తున్నారు. నిరసనలో భాగంగా వంట వార్పు చేసుకుని రాత్రి అక్కడే బస చేశారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చుట్టూ పరదాలు కట్టుకొని అక్కడే తిని పడుకున్నారు. ఈ ధర్నా రేపు కూడా ఉంటుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు.

Similar News

News December 6, 2025

శ్రీశైలం: పాతాళగంగ నీరు పచ్చగా ఎందుకు?

image

చంద్రగుప్త మహారాజు ఓ రాజ్యాన్ని ఓడించి, అంతఃపురంలో ఉన్న రాణిని తన కూతురని తెలియక ఆశించాడు. ఆ విషయం తెలిసినా వెనక్కి తగ్గలేదు. దీంతో చంద్రవతి శ్రీశైలం వచ్చి శివుడిని ప్రార్థించింది. అక్కడకు వచ్చిన చంద్రగుప్తుడు చంద్రవతిని చెడగొట్టబోతుండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. కామంతో కనులు మూసుకుపోయిన చంద్రగుప్తుడిని పచ్చలబండపై పాతాళగంగలో పడి ఉండమని శాపమిచ్చాడు. అందుకే పాతాళగంగ నీరు పచ్చగా ఉంటుందని కథనం.

News December 6, 2025

KMR: రెండో విడత.. ఆ 7 మండలాల్లో మద్యం బంద్: కలెక్టర్

image

KMR జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల 2వ విడత పోలింగ్ DEC 14న జరగనుంది. ఈ విడతలో గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, మొహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం సహా 7 మండలాల్లో (ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మినహా) వైన్ షాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 12వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే DEC 14వ తేదీ వరకు ఈ బంద్ కొనసాగుతుందని పేర్కొన్నారు.

News December 6, 2025

KMR: మూడో విడత.. ఆ 8 మండలాల్లో మద్యం బంద్

image

KMR జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడత పోలింగ్ DEC 17న జరగనుంది. ఈ విడతలో బాన్సువాడ, బీర్కూర్, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్ సహా 8 మండలాల్లో (బిచ్కుంద,బాన్సువాడ మున్సిపాలిటీలు మినహా) వైన్ షాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే DEC 17వ తేదీ వరకు ఈ బంద్ కొనసాగుతుందని పేర్కొన్నారు.