News May 10, 2024
భువనగిరి కోటపై ఎర్రజెండా ఎగరేస్తారా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు కామ్రేడ్లదే హవా. ఏ ఎన్నికైనా గెలిచి తీరాల్సిందే. 1952లో ఎంపీ సెగ్మెంట్‌లో నల్గొండ నుంచి అధిక మెజార్టీ, 1957, 1962లో వామపక్షాలే గెలిచాయి. మళ్లీ 1991, 96,98, 2004లో కామ్రెడ్లదే విజయం. అంతటి ఘన చరిత్ర కలిగిన కామ్రెడ్లు కొంతకాలంగా మద్దుతుకే పరిమితమయ్యారు. ఈసారి భువనగిరిలో సీపీఎం ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తుండగా ఏమేరకు ఓట్లు సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.
Similar News
News July 8, 2025
NLG: రైతులకు యూరియా కష్టాలు ఇంకెన్నాళ్లు!?

నల్గొండ జిల్లాలోని రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లు యూరియాను విక్రయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు వచ్చిన యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతుంది. ప్రైవేట్ డీలర్లు యూరియా అమ్మితే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు.
News July 8, 2025
నల్గొండ: నిరుద్యోగ యువకులకు హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు హౌస్ వైరింగ్ (ఎలక్ట్రీషియన్) లో 31 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. 18 నుంచి 45 సం. లోపు ఉన్న వారు అర్హులని అన్నారు. ఆసక్తి గలవారు జూలై 9 లోపు సంస్థ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News July 7, 2025
నల్గొండలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..!

నల్గొండలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఓ ఇంటిని కిరాయికి తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న వ్యవహారంపై నిఘా పెట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు మెరుపు దాడులు చేసి పట్టుకున్నట్లు సమాచారం.