News April 11, 2025
భువనగిరి: గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

గంటల వ్యవధిలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. రామన్నపేట మండలం నిదానపల్లిలో జింకల అంజి, కావ్య డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కావ్య గురువారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న అంజి పురుగు మందు తాగి చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 11, 2026
ఖమ్మం: తిరుపతి బస్సులకు చార్జీల తగ్గింపు

భద్రాచలం, మణుగూరు, సత్తుపల్లి డిపోల నుంచి తిరుపతి వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు చార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే ఈ సర్వీసుల్లో ప్రయాణికులకు 16% నుంచి 40% వరకు రాయితీ కల్పించారు. తిరుపతికి గరిష్ఠంగా ₹130, విజయవాడకు ₹120, గుంటూరుకు ₹110 చొప్పున చార్జీలు తగ్గించినట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.
News April 11, 2026
వరంగల్: అంగన్వాడీ సేవలు స్మార్ట్ దిశగా.. 4జీ ఫోన్ల పంపిణీ

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్‌గా మారనుంది. వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 919 కేంద్రాల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం 4జీ సెల్‌ఫోన్లను అందిస్తోంది. మొత్తం 874 ఫోన్లు పంపిణీ చేయనుండగా, ఇప్పటి వరకు పాత 2జీ ఫోన్లతో ఎదురైన సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించనుంది.పోషణ్ ట్రాకర్ యాప్, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు వంటి ప్రక్రియలు వేగవంతం అవుతాయి.
News April 11, 2026
వెనక్కి తగ్గిన నువాన్ తుషార

IPLలో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు NOC ఇవ్వట్లేదని కోర్టుకెక్కిన నువాన్ తుషార వెనకడుగు వేశారు. కేసును వెనక్కి తీసుకోవడంతో పాటు బోర్డుకు సారీ చెప్పారు. గవర్నింగ్ బాడీని ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని మెయిల్ పంపారు. బోర్డు తన పట్ల పారదర్శకంగా వ్యవహరించలేదని, న్యాయం కోసం అలా చేశానని పేర్కొన్నారు. SL బోర్డు NOC ఇవ్వకపోవడంతో RCBకి ప్రాతినిధ్యం వహించాల్సిన తుషార ఇంకా జట్టులో జాయిన్ కాలేదు.


