News March 16, 2025
భువనగిరి జిల్లాలో చికెన్ ధరలిలా..

భువనగిరి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్ స్కిన్) కేజీ రూ.150-160 ఉండగా.. స్కిన్లెస్ కేజీ రూ.170-180 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.100-110 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.
Similar News
News November 21, 2025
BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
వనపర్తి నూతన ఎస్పీగా డి.సునీత

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సునీతను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సునీత బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు వ్యవస్థ బలోపేతానికి ఆమె కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.


