News March 22, 2025
భువనగిరి జిల్లాలో వర్షపాత వివరాలు

భువనగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా భువనగిరి మండలంలో 29మిమీ వర్షం కురవగా, అత్యల్పంగ మోత్కూర్ మండలంలోని దతప్పగూడెంలో 0.8మిమీ వాన పడింది. యాదగిరిగుట్టలో 23.8మిమీ, బొమ్మలరామారం 23.3మిమీ, మూటకొండూర్ 20 మిమీ, రాజాపేట 17.3మిమీ, తుర్కపల్లి 16.3మిమీ, ఆత్మకూర్ 7.8మిమీగా నమోదైంది.
Similar News
News November 2, 2025
ముంచెత్తిన వరదలు.. ఆ ఇళ్లకు పరిహారం!

TG: మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు వరంగల్ను ముంచెత్తాయి. దీంతో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పూర్తి నష్టం జరిగిన ఇళ్లకు రూ.1.30 లక్షలు, నీట మునిగిన ఇళ్లకు రూ.15వేలు, దెబ్బతిన్న గుడిసెలకు రూ.8వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.6,500 ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నష్టంపై అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.
News November 2, 2025
SKLM: ఒక్కొక్కరికి రూ.17లక్షల పరిహారం

కాశీబుగ్గ వేంకన్న ఘటన నేపథ్యంలో ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే కేంద్రం మృతుల కుటుంబానికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ప్రకటించింది. మొత్తంగా చనిపోయిన కుటుంబానికి రూ.17లక్షలు, గాయపడిన వారికి రూ.3.50లక్షల అందనుంది. మృతుల్లో TDP కార్యకర్తలు ఉండటంతో రూ.5లక్షల చొప్పున ఇన్సురెన్స్ రానుంది.
News November 2, 2025
పెంబి: గుంతలో పడి చిన్నారి మృతి

ఇంటి నిర్మాణం కోసం తీసిన పిల్లర్ల గుంతలో పడి చిన్నారి నాగపుష్ప(6) మృతి చెందింది. ఈ ఘటన నిర్మల్(D) పెంబి (M) వేనునగర్లో జరిగింది. ఎస్ఐ హన్మాండ్లు తెలిపిన వివరాలు.. ఆత్రం రాము-రేణుక దంపతుల కుమార్తె నాగపుష్ప శనివారం సాయంత్రం అంగన్వాడీ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.


