News February 19, 2025

భువనగిరి జిల్లా టాప్ న్యూస్

image

☞ ఈనెల 23న యాదాద్రికి సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలన ☞ చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం ☞ భువనగిరిలో కలెక్టర్ హనుమంతరావు పర్యటన ☞ సుందరంగా ముస్తాబైన యాదాద్రి క్షేత్రం ☞ భువనగిరి కలెక్టర్‌కు ఇన్విటేషన్ ☞ HYD బోడుప్పల్‌లో విగ్రహ ప్రతిష్ఠలో కోమటిరెడ్డి, బీర్ల☞ గుండాలలో నీటి ఎద్దడి

Similar News

News December 8, 2025

యాదగిరిగుట్ట: గాంధీ ఆస్పత్రి పైనుంచి దూకి సూసైడ్

image

గాంధీ ఆస్పత్రి పైనుంచి ఓ వ్యక్తి దూకడం తీవ్ర కలకలం రేపింది. యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన నరేందర్ (37) అప్పులబాధతో డిసెంబర్ 1న పురుగుమందు తాగి చికిత్స పొందుతున్నాడు. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు 3వ అంతస్తు AMC వార్డు బాత్రూం కిటికీ నుంచి దూకి మృతిచెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 8, 2025

మాలిలో కిడ్నాప్‌.. ఆచూకీ కోసం ‘బండి’ వద్దకు కుటుంబీకులు

image

మాలి దేశంలో తీవ్రవాదుల ద్వారా కిడ్నాప్‌కు గురైన తెలంగాణ, ఏపీ వాసులు నల్లమాసు ప్రవీణ్ రెడ్డి, కుమారాకుల రామచంద్రలను రక్షించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ను కలిశారు. గతనెల 23న మాలిలో వీరిని కిడ్నాప్‌ చేసి రోజులు గడుస్తున్నా ఆచూకీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించి, వెంటనే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడారు.

News December 8, 2025

మెదక్: రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ: ఎస్పీ

image

CEIR పోర్టల్ ద్వారా రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పోగొట్టుకున్న 1,734 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని వివరించారు. కోల్పోయిన ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.