News February 23, 2025
భువనగిరి జిల్లా టాప్ న్యూస్

✓ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సుధీర్ బాబు ✓ బీబీనగర్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు ✓ నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు ✓ భువనగిలో దోశలో బొద్దింక ✓ బసవలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే కుంభం ✓ మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు
Similar News
News November 10, 2025
19న పుట్టపర్తికి PM మోదీ రాక: CBN

AP: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న PM మోదీ పుట్టపర్తికి రానున్నారని CM CBN తెలిపారు. అలాగే 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వస్తారన్నారు. ఈ నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రుల కమిటీ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. కాగా 65 ప్రత్యేక రైళ్లతో పాటు ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు 682 రైళ్లు పుట్టపర్తికి రైల్వే శాఖ నడుపనుందని అధికారులు వివరించారు.
News November 10, 2025
మెదక్: ‘ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు’

సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 2017 సంవత్సరంలో పశు సంచార వైద్యశాలను అందించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, హెల్పర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పశువులకు సేవలందిస్తున్న తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 10, 2025
PDPL: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

పెద్దపల్లి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన హౌసింగ్, భూమి నమోదు, వితంతు పెన్షన్, కుటుంబ వివాదాలపై దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డి.వేణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బి.వనజా తదితరులు పాల్గొన్నారు.


