News February 24, 2025
భువనగిరి జిల్లా టాప్ న్యూస్

☞ తుర్కపల్లి డిప్యూటీ తహశీల్దార్ కల్పనకు కలెక్టర్ హనుమంతరావు మెమో జారీ ☞ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సెంటర్ల పరిశీలన ☞ భువనగిరికి వచ్చిన బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మీ ☞ సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంటలు ☞ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు ☞ తుర్కపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు
Similar News
News February 25, 2025
పి-4 సర్వేను వేగవంతం చేయండి: ప్రకాశం కలెక్టర్

పి-4 సర్వేను వేగవంతం చేయాలని కలెక్టరు తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి ఒకటో తేదీన పెన్షన్‌ల పంపిణీ ఉంటుందని, రెండో తేదీ ఆదివారం అయినందున ఈ సర్వేను ఈవారం లోనే పూర్తి చేయాలని స్పష్టం చేసారు. క్షేత్ర స్థాయిలో సచివాలయ సిబ్బంది మరింత చురుకుగా పని చేయాలని ఆమె కోరారు.
News February 25, 2025
టాయిలెట్‌కు మొబైల్ తీసుకెళ్తున్నారా?

టాయిలెట్‌లోకి మొబైల్ తీసుకెళ్లి గంటల కొద్దీ మాట్లాడటం, రీల్స్ చూడటం కొందరికి అలవాటుగా మారింది. అయితే కమోడ్‌పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల నొప్పితో కూడిన ఇన్‌ఫ్లమేషన్, మొలలు, తీవ్ర కేసుల్లో యానల్ ఫిస్టులాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. చిరుతిళ్లు ఎక్కువగా తినడం, సరిపడిన నీరు తాగకపోవడమూ దీనికి కారణమవుతున్నట్లు పేర్కొంటున్నారు.
News February 25, 2025
భూపాలపల్లి: 8న జాతీయ లోక్ అదాలత్

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.