News February 19, 2025

భువనగిరి జిల్లా టాప్ న్యూస్

image

☞ ఈనెల 23న యాదాద్రికి సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలన ☞ చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం ☞ భువనగిరిలో కలెక్టర్ హనుమంతరావు పర్యటన ☞ సుందరంగా ముస్తాబైన యాదాద్రి క్షేత్రం ☞ భువనగిరి కలెక్టర్‌కు ఇన్విటేషన్ ☞ HYD బోడుప్పల్‌లో విగ్రహ ప్రతిష్ఠలో కోమటిరెడ్డి, బీర్ల☞ గుండాలలో నీటి ఎద్దడి

Similar News

News March 17, 2025

గుంటూరు: 10మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

image

గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎం.ఎం ఖుద్దూస్ 10 మంది ఉపాధ్యాయులకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పదోతరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ రిపోర్ట్‌లో నిర్లక్ష్యం చేయడంతో ఆ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశానుసారం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తాఖీదు అందిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని ఖుద్దూస్ సూచించారు.

News March 17, 2025

మీ పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటున్నారా?

image

చాక్లెట్ల నుంచి పిల్లలను వేరు చేయలేం. వాటిని సాధించేదాక వాళ్లు చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలా అని ఒకటితో సరిపెట్టరు. ఇలా ఎక్కువగా చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోవడంతో పాటు వాటికి రంధ్రాలు ఏర్పడే ఆస్కారం ఉంది. అలాగని వాటిని తినకుండా ఉంచలేం. కాబట్టి రాత్రి పడుకునే ముందు వారితో బ్రష్ చేయిస్తే పళ్ల మధ్య అతుక్కుపోయిన చాక్లెట్ బయటికి వస్తుంది. దీంతో 10 గంటల వరకూ పళ్లకు రక్షణ కలుగుతుంది.

News March 17, 2025

SRPT: మొట్టమొదటి MBBS డాక్టర్‌ రామకృష్ణారెడ్డి మృతి

image

కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ బీ.రామకృష్ణారెడ్డి ఆదివారం కోదాడలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతిచెందారు. కాగా, కోడాడకు మొట్టమొదటి MBBS డాక్టర్‌ ఈయనే. రామకృష్ణారెడ్డికి కోదాడ పరిసర ప్రాంతాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన అమెరికాలో ఎండీ కోర్స్ పూర్తి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

error: Content is protected !!