News February 3, 2025
భువనగిరి: జోరందుకున్న వరి నాట్లు

యాదాద్రి జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 2,71,002 ఎకరాలలో వరి సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో 30 వేల ఎకరాలలో సాగయ్యే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. వానకాలంతో పోలిస్తే యాసంగిలో అధికంగా సాగైనట్లు చెబుతున్నారు. భువనగిరి, ఆలేరు డివిజన్ల పరిధిలో మల్లన్న సాగర్, గోదావరి జిల్లాలు వస్తుండడంతో రైతులు వరిసాగుపై మొగ్గు చూపుతున్నారు.
Similar News
News November 28, 2025
ఆ దేశాల నుంచి ఎవరినీ రానివ్వం: ట్రంప్

థర్డ్ వరల్డ్ కంట్రీస్(అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని) నుంచి శాశ్వతంగా మైగ్రేషన్ నిలుపుదల చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ‘US సిస్టమ్ పూర్తిగా కోలుకునేందుకు ఇది తప్పనిసరి. బైడెన్ హయాంలో వచ్చిన అందరు అక్రమ వలసదారులను, దేశానికి ఉపయోగపడని వారిని, నేరాలు చేసిన వారిని పంపేయాలి. నాన్ సిటిజన్స్కు సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ రద్దు చేయాలి’ అని తెలిపారు.
News November 28, 2025
మట్టి పాత్రలు ఎలా వాడాలంటే?

ప్రస్తుతం చాలామంది మట్టిపాత్రలు వాడటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. కొత్త మట్టిపాత్రను వాడేముందు సీజనింగ్ చేయాలి. రోజంతా నీళ్లలో నానబెట్టి ఆరాక పూర్తిగా నూనె రాసి ఆరనివ్వాలి. కుండను చిన్న సెగ మీద ఉంచి మంటను పెంచుతూ వెళ్లాలి. వీటిలో ఆహారం కూడా చాలా సేపు వేడిగా ఉంటుంది. వీటిని క్లీన్ చేయడానికి ఇసుక, సున్నిపిండి, బూడిద, కుంకుడు రసం వాడాలి.
News November 28, 2025
VKB: వంట రాదని భర్త వేధింపులతో ఆత్మహత్య

‘వంట రాదు, నా కన్నా తక్కువగా చదువుకున్నావు’ అని భర్త వేధించడంతో <<18402838>>ఓ యువతి<<>> ఆత్మహత్య చేసుకున్న ఘటన ధరూర్ మండలంలో జరిగింది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాలు.. ధరూర్ మండలం గంగారం యువతితో(21) పరిగి మండలం మల్లెమోనిగూడకు చెందిన శివలింగంతో 5 నెలల క్రితం వివాహమైంది. వంటరాదు, తక్కువగా చదువుకున్నావని భర్త వేధించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో మనస్థాపం చెంది పుట్టింటి వద్ద ఆత్మహత్య చేసుకుంది.


