News February 3, 2025
భువనగిరి: జోరందుకున్న వరి నాట్లు

యాదాద్రి జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 2,71,002 ఎకరాలలో వరి సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో 30 వేల ఎకరాలలో సాగయ్యే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. వానకాలంతో పోలిస్తే యాసంగిలో అధికంగా సాగైనట్లు చెబుతున్నారు. భువనగిరి, ఆలేరు డివిజన్ల పరిధిలో మల్లన్న సాగర్, గోదావరి జిల్లాలు వస్తుండడంతో రైతులు వరిసాగుపై మొగ్గు చూపుతున్నారు.
Similar News
News February 15, 2025
వరంగల్: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

తెలియక ఓ చెట్టు పండ్లను తిన్న గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.HNK జిల్లా హసన్‌పర్తి జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో శుక్రవారం పలువురు విద్యార్థులు ఇదే గురుకులంలోని ఒక చెట్టు పండ్లను తిన్నారు. దీంతో ఆరుగురు విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
News February 15, 2025
మేడ్చల్: పిల్లలకు కంటి పరీక్షలు.. DON’T MISS

మేడ్చల్ జిల్లాలో ఫిబ్రవరి 17 నుంచి మార్చి 15 వరకు 21 రోజుల పని దినాల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని DMHO ఉమా గౌరీ తెలిపారు. జిల్లాలోని అన్ని స్కూళ్ల నుంచి రోజుకు 150 నుంచి 200 మంది చొప్పున వైద్య సిబ్బంది వెంట తీసుకుని వెళ్లి మల్కాజిగిరిలోని ఏరియా ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేపించి, తిరిగి పిల్లలను స్కూల్లో దింపుతారు.కొద్ది రోజులకు కంటి లోపం ప్రకారం అద్దాలు అందిస్తారు.
News February 15, 2025
కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.