News February 4, 2025
భువనగిరి: తొలి రోజు 115 మంది డుమ్మా!

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. జనరల్ ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 586 మందికి గాను 579 మంది హాజరు కాగా 7 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలకు 1,564 మందికి గాను 1456 మంది హాజరుకాగా 108 మంది గైర్హాజరయ్యారు. ఈనెల 3 నుంచి 22 వరకు మూడు దఫాలుగా 2 పూటలా జరుగనున్న ప్రాక్టికల్స్‌కు జనరల్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు 6,200మంది హాజరు కావాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
26న BRS సన్నాహక సమావేశం: జీవన్ రెడ్డి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న నిర్వహించనున్న ‘దీక్షా దివస్’ను విజయవంతం చేయడానికి నిజామాబాద్‌లో ఈ నెల 26న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 ఒక మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అనే నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఆయన గుర్తు చేశారు.
News November 25, 2025
HYD: బాక్సు ట్రాన్స్‌ఫార్మర్లతో బేఫికర్!

‘చుట్టూ కంచె లేని ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లు.. పట్టించుకోని పాలకులు’.. తరచూ TGSPDCLకి మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులు. గ్రేటర్‌లో ఈ సమస్యకు చెక్ పెట్టేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదాలు నివారించేలా కాంపాక్ట్ సబ్‌స్టేషన్లు, బాక్సు టైప్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలుత కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, మిగతా ఏరియాలకు విస్తరించనున్నారు.
News November 25, 2025
జనగామ: డబుల్ బెడ్ రూంల పరిస్థితి ఏంటి.?

జిల్లాలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో వాటిని పంచకపోవడం, కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో కొన్ని గ్రామాల్లో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని పేద కుటుంబాలకు వాటిని పంచి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.


