News January 31, 2025

భువనగిరి – నల్గొండ బైపాస్ వద్ద యాక్సిడెంట్ 

image

వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి – నల్గొండ బైపాస్ ఫ్లైఓవర్ మీద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 27, 2025

సూర్యాపేట జిల్లాలో మొదటి రోజు 245 నామినేషన్లు

image

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచి స్థానాలకు 207 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 1,442 వార్డులకు 38 మంది నామినేషన్ దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ తెలిపారు.

News November 27, 2025

కామారెడ్డి జిల్లాలో తొలిరోజు 210 నామినేషన్లు

image

కామారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 167 గ్రామ పంచాయతీల్లో (1,520 వార్డులకు) ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు సర్పంచి స్థానాలకు 115 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 95 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రాలేదు.

News November 27, 2025

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రమును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.