News February 3, 2025
భువనగిరి: నేడో, రేపో అధ్యక్షుడి పేరు ప్రకటన!

బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుదిదశకు చేరింది. నేడో, రేపో అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఊట్కూరి అశోక్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి పేర్లను స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర నాయకత్వానికి పంపింది. ఇందులో ఒకరి పేరు ఖరారు చేసింది. జిల్లా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర నాయకత్వం.. పదవి బీసీకి కట్టిపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Similar News
News December 4, 2025
ఏలూరు: భర్తను బెదిరించబోయి.. ప్రాణాలు కోల్పొయింది

భర్త మద్యం మానేయాలని బెదిరించే క్రమంలో పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన అడవికొలనులో చోటుచేసుకుంది. నిడమర్రు ఎస్ఐ రమేష్ కథనం ప్రకారం… గ్రామానికి చెందిన చిన్నిపిల్లి లక్ష్మి.. మద్యానికి బానిసైన తన భర్తను తాగుడు మాన్పించాలని గురువారం బెదిరించేందుకు, సోడా సీసాలో ఉన్న పురుగుల మందు తాగింది. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింనట్లు ఎస్ఐ వెల్లడించారు.
News December 4, 2025
కామారెడ్డి: చిత్తడి నేలల సంరక్షణకు కలెక్టర్ కీలక ఆదేశాలు

కామారెడ్డి జిల్లాలోని చిత్తడి నేలలను గుర్తించడం, సంరక్షణ చర్యలపై గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఇంటర్ డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు, సహజ, కృత్రిమ చెరువులు, కుంటలు వంటి చిత్తడి నేలలను ప్రమాణాల ప్రకారం గుర్తించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ, అరణ్య, నీటిపారుదల, ఫిషరీస్ శాఖల సంయుక్త బృందం ఫీల్డ్ సర్వే త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
News December 4, 2025
పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్లో పెట్టకండి!

అధిక కాలం తాజాగా ఉంచడానికి చాలామంది ప్రతీ వస్తువును ఫ్రిజ్లో పెడుతుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా ఫ్రిజ్లో పెట్టకూడని ఆహారాలు.. డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, కాఫీ, నూనెలు, కుంకుమ పువ్వు, బ్రెడ్, క్యారెట్, అల్లం, ముల్లంగి, బంగాళదుంపలు. ఒకవేళ తప్పకుండా ఫ్రిజ్లోనే పెట్టాలి అనుకుంటే గాజు జార్లో ఉంచడం బెస్ట్.


