News February 3, 2025
భువనగిరి: నేడో, రేపో అధ్యక్షుడి పేరు ప్రకటన!

బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుదిదశకు చేరింది. నేడో, రేపో అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఊట్కూరి అశోక్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి పేర్లను స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర నాయకత్వానికి పంపింది. ఇందులో ఒకరి పేరు ఖరారు చేసింది. జిల్లా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర నాయకత్వం.. పదవి బీసీకి కట్టిపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Similar News
News January 18, 2026
NZతో అమీ తుమీ.. RO-KO జోడీపైనే ఆశలు!

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. నేడు ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ జరగనుంది. రెండో వన్డేలో రాహుల్, గిల్ మెప్పించినా.. రోహిత్, కోహ్లీ ఇద్దరూ రాణించలేకపోవడం మైనస్ అయ్యింది. ముఖ్యంగా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అర్ష్‌దీప్‌కు అవకాశమివ్వాలని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 1.30 గం.కు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.
News January 18, 2026
ఇవాళ ఈ తప్పులు అస్సలు చేయకండి!

నేడు మౌని అమావాస్య కావడంతో సముద్ర/గంగానది స్నానం, ఉపవాసం, మౌనవ్రతం, పూర్వీకులకు తర్పణం, దానాలు చేయడం మంచిది. వ్రత ఫలితం దక్కాలంటే ఈ తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ‘కోపం తెచ్చుకోవడం, ఆర్గ్యుమెంట్స్, అనవసర సంభాషణలు, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, నెగటివ్ థింకింగ్ మానుకోవాలి. సోమరితనాన్ని వదిలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని సూచిస్తున్నారు.
News January 18, 2026
నేడు ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం

డబ్బు చేతిలో నిలవక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కుంకుమపువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణావర్త శంఖంలో పోసి పూజగదిలో ఉంచాలి. అనంతరం ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ‘ఓం శ్రీ మహాలక్ష్మిదేవ్యై నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు భక్తితో జపించాలి. చొల్లంగి సంగమ స్నానం తర్వాత చేసే ఈ చిన్న పరిహారం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు.


