News March 24, 2025
భువనగిరి: పది పరీక్షలకు 10 మంది డుమ్మా

భువనగిరి జిల్లాలో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు DEO సత్యనారాయణ తెలిపారు. మూడవ రోజు ఇంగ్లీషు పరీక్ష 50 పరీక్ష కేంద్రాల్లో జరగగా ఆయన 4, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను సందర్శించామన్నారు. మొత్తం 8,618 విద్యార్థులకు 8,608 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 10మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Similar News
News April 1, 2025
పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: DEO

ఒంటిపూట బడులకు భిన్నంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి C.V రేణుక ఒక ప్రకటనలో హెచ్చరించారు. మార్చి 15 నుండి ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించినా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని పాటించడం లేదని డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 ని.ల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
News April 1, 2025
TTD పనితీరు అస్తవ్యస్తం.. చర్యలు తీసుకోండి: PMకు ఎంపీ లేఖ

AP: తిరుమలలో భద్రతా వైఫల్యాలపై జోక్యం చేసుకోవాలంటూ PM మోదీ, హోంమంత్రి అమిత్షాకు YCP MP గురుమూర్తి లేఖ రాశారు. ‘వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. అన్నదానం క్యూకాంప్లెక్స్లోనూ తొక్కిసలాట జరిగింది. కొండపైకి మాంసం, మద్యం తీసుకెళ్తున్నారు. పాపవినాశనం డ్యామ్లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లు తిప్పారు. TTD పనితీరు అస్తవ్యస్తంగా మారింది. ఈ ఘటనలపై చర్యలు తీసుకోండి’ అని కోరారు.
News April 1, 2025
నాగర్కర్నూల్: ఊర్కొండపేట ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉర్కొండపేటలో మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులతో సీతక్క మాట్లాడి.. కేసు పురోగతి వివరాలు, బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని రకాల సహాయం అందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.