News March 2, 2025
భువనగిరి: పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సందేశం

కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న పదో తరగతి విద్యార్థులకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆత్మ విశ్వాసాన్ని నింపే వాయిస్ మెసేజ్ పంపించారు. జిల్లాలోని 192 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 5,125 విద్యార్థులకు ఏకకాలంలో శనివారం రాత్రి 7 గంటలకు వాయిస్ సందేశం పంపించారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని నిరాశ నిస్పృహలకు దరి చేరనివ్వకుండా ఉండాలని సూచించారు.
Similar News
News November 4, 2025
లాజిస్టిక్ కారిడార్‌తో అభివృద్ధి: చంద్రబాబు

APలో అంతర్గత జల రవాణాకు పుష్కలంగా అవకాశాలున్నాయని CM చంద్రబాబు పేర్కొన్నారు. లండన్‌లో పారిశ్రామికవేత్తలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. లాజిస్టిక్ కారిడార్‌తో APని అభివృద్ధి చేసే ప్రణాళికలు రచిస్తున్నట్లు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలతో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. జల రవాణాపై పని చేసేందుకు ముందుకు రావాలని లండన్‌లోని అరుప్ సంస్థను CM కోరారు.
News November 4, 2025
చేవెళ్ల: 19 మందిని పొట్టన పెట్టుకున్న టిప్పర్ ఇదే..!

మీర్జాగూడలో జరిగిన రోడ్డుప్రమాదంలో 19మందిని పొట్టనపెట్టుకున్న టిప్పర్‌పై 2చలాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా నిషేధిత సమయాల్లో భారీ లోడ్‌తో నగరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో చందానగర్, RCపురంలో HYD పోలీసులు చలాన్లు విధించారు. అనిత అనే పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మోతాదుకు మించిన కంకరలోడు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
News November 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 04, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


