News March 20, 2025
భువనగిరి: పర్యాటకానికి చేయూత

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ పర్యాటకుల కోసం వసతులు కల్పించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యాదగిరిగుట్ట, భువనగిరి, కొలనుపాక, బస్వాపూర్, మహదేవపూర్ ప్రాంతాలను టూరిజం శాఖ ప్రత్యేక పర్యాటక కేంద్రాలుగా గుర్తించింది. దీంతో జిల్లా వాసులు హర్షిస్తున్నారు. కాగా చారిత్రక, ఆధ్యాత్మిక ఎకో టూరిజం కోసం నిధులు కేటాయించారు.
Similar News
News November 2, 2025
భద్రాద్రి: రేపు డివిజన్ల వారీగా ప్రజావాణి

ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు. జిల్లాలోని భూసమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నందున డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కలెక్టరేట్ ఇన్ వార్డులో కూడా తమ దరఖాస్తులు ఇవ్వొచ్చని సూచించారు.
News November 2, 2025
తుఫాను: రైతులను పరామర్శించనున్న జగన్

AP: మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తమ అధినేత జగన్ పరామర్శిస్తారని వైసీపీ తెలిపింది. ఈ నెల 4న కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పేర్కొంది. కాగా జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వచ్చారు.
News November 2, 2025
అలంపూర్ ఎమ్మెల్యే ఫోన్ నంబర్ హ్యాక్

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లనే టార్గెట్గా చేసుకుంటున్నారు. వారికి తెలియకుండానే వారి మొబైల్ని, లేదా సిస్టమ్ని హ్యాక్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఫోన్ను హ్యాక్ చేశారు. తన మొబైల్ నుంచి వచ్చే ఎలాంటి సందేశాలకు ఎవ్వరూ కూడా రెస్పాండ్ కావద్దని ఎమ్మెల్యే సూచించారు.


