News January 31, 2025
భువనగిరి: పొంగుతున్న వాగులపై పొలిటికల్ వార్

యాదాద్రి జిల్లాలో మల్లన్న సాగర్ నుంచి వచ్చే సాగునీటితో కొన్నిచోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ కామెంట్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివద్ధి వల్లే రైతులకు సాగు నీరు సమృద్ధిగా లభిస్తోందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. బీఆర్ఎస్ వదిలేసిన పనులను పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నామని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఇంతకీ మీరేమంటారు.
Similar News
News February 11, 2025
షాద్‌నగర్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోలిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. షాద్‌నగర్ పట్టణానికి చెందిన గౌస్ పాషా (45) తండ్రి షేక్ ఖాసిం భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ రాహుల్ కుమార్ ఫిర్యాదుతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 11, 2025
డ్రగ్స్ కేసులో ‘దసరా’ విలన్‌కు ఊరట

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు నుంచి బయటపడ్డారు. అతనితోపాటు మరో ఆరుగురిని కొచ్చి అదనపు సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2015, జనవరి 30న ఓ ఫ్లాట్‌లో కొకైన్ తీసుకున్నారనే ఆరోపణలతో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత కేసులో తీర్పు వెలువడింది. దసరా మూవీతో ఇతను టాలీవుడ్‌లోనూ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
News February 11, 2025
మహబూబాబాద్: సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు స్పెషల్ బస్సు

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ జాతర పురస్కరించుకొని మహబూబాబాద్ డిపో నుంచి ఉ.8 గ.లకు జాతర స్పెషల్ బస్సును ప్రారంభిస్తున్నామని డిపో మేనేజర్ శివప్రసాద్ ప్రకటనలో తెలిపారు. బస్సు ఉదయం 08:00 గంటలకు మహబూబాబాద్ నుంచి బయలుదేరి 12:00 pm మేడారం చేరుకొని, మళ్లీ సాయంత్రం 5:00 గంటలకు మేడారం నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు మహబూబాబాద్ చేరుకుంటుందని మేనేజర్ పేర్కొన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.