News March 20, 2025
భువనగిరి: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ, వాణిజ్య శాస్త్రం పరీక్షలకు 6,395 మంది విద్యార్థులకు గాను 6,035 మంది హాజరయ్యారు. 360 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. హాస్టళ్లు, అద్దె ఇళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు బాటపట్టారు. దీంతో భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా కనిపించింది.
Similar News
News November 28, 2025
స్విగ్గీ, జొమాటో, జెప్టో గోడౌన్లలో ఇదీ పరిస్థితి

TG: హైదరాబాద్‌లో ఆన్లైన్ డెలివరీ సంస్థల గోడౌన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. స్విగ్గీ, జెప్టో, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు చెందిన 75 గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఎక్స్పైర్డ్, మిస్ బ్రాండెడ్ వస్తువులను సీజ్ చేశారు. కుళ్లిన ఫ్రూట్స్, కూరగాయలను గుర్తించారు. పలు వస్తువుల శాంపిల్స్ సేకరించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
News November 28, 2025
పృథ్వీరాజ్ ఎదగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు: తల్లి మల్లిక

పృథ్వీరాజ్ కెరీర్‌ను నాశనం చేసేలా సైబర్ అటాక్ జరుగుతోందని తల్లి మల్లిక ఆరోపించారు. అతను ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, సోషల్ మీడియాలో ఘోరంగా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ పనులను ఆపేంత వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇటీవల పృథ్వీరాజ్ నటించిన విలయత్ బుద్ధ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. తెలుగులో వారణాసి చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
News November 28, 2025
HYD: మెగా కార్పోరేషన్‌గా జీహెచ్ఎంసీ

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో GHMC మెగా కార్పోరేషన్‌గా అవతరించింది. కాగా కార్పోరేషన్‌ను 2 లేదా 3గా విభజించాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. సంస్థాగత పునర్విభజన, కార్పొరేషన్ బట్టి ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది.


