News February 27, 2025
భువనగిరి: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో తమకు చిల్లర బాధలు తప్పుతాయని యాదగిరిగుట్ట బస్ స్టేషన్ నుంచి ప్రయాణించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 3, 2025
మంచిర్యాల: 4న ఉచిత చేప పిల్లల పంపిణీ

జిల్లాలోని లక్షట్టిపేట మండలం గుండ్ల కోటలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈనెల 4న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ చెప్పారు. జిల్లాలోని 380చెరువులు రిజర్వాయర్లు ఉన్నాయని,వీటిలో 369 సీజనల్ చెరువులలో 115.65 లక్షల 35-40మి.మీ చేప పిల్లలు,5 పెరినియల్,6రిజర్వాయర్లలో 108.28 లక్షల చేప పిల్లలను వదలుతామన్నారు.
News November 3, 2025
OTTలోకి కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాలు త్వరలో నెట్ఫ్లిక్స్లోకి రానున్నాయి. ఈ నెల 7 నుంచి ‘తెలుసు కదా’, 14 నుంచి ‘డ్యూడ్’ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇటీవల విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ సినిమా OTT హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. నెల రోజుల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముంది.
News November 3, 2025
NRPT: ‘చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి’

నారాయణపేట జిల్లాలో చేపపిల్లలు, రొయ్యల పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు. పలు జిల్లాలు పంపిణీలో వెనుకబడి ఉన్నాయని, దీనిని వేగవంతం చేయాలని మంత్రి సూచించారు.


