News October 2, 2024
భువనగిరి: ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సమీక్ష సమావేశం

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్డుల జారీ కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కాగా జరిపించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంత్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 24, 2025
నల్గొండ: వారికి అభ్యర్థులు నచ్చలేదు..!

పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో దానికి 3,132 ఓట్లు పడ్డాయి. అడవిదేవులపల్లి మండలంలో తక్కువగా 34 ఓట్లు పోలవగా, పెద్దవూర మండలంలో అత్యధికంగా 267 మంది నోటాకు ఓటేశారు. కొంతమందికైతే సరిగా ఓటేయడం రాలేదు. దీంతో 12,253 ఓట్లు చెల్లలేదు. కాగా జిల్లాలో మొత్తంగా 10,37,411 మంది ఓటర్లుండగా 9,00,338 మంది ఓటేశారు.
News December 24, 2025
నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

డిండి: రోడ్డుపైకి అడవి పంది.. యువకుడి మృతి
మిర్యాలగూడలో యువకుడి శవం కలకలం
నల్గొండ : మంత్రులపై కేటీఆర్ కామెంట్స్
కనగల్: వైద్య సేవలపై కలెక్టర్ ఆరా
కట్టంగూరు: పశు వైద్యశాలల్లో మందుల్లేవ్
నల్గొండ: చలిలో మున్సిపల్ కార్మికు అరిగోస
నల్గొండ: 2025@ విషాదాల సంవత్సరం
నల్గొండ: జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ల ధర్నా
News December 23, 2025
రేపు నల్గొండలో ట్రై సైకిళ్ల పంపిణీ

జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం మరో ముందడుగు వేసింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక చొరవతో ఈసీఐఎల్ సీఎస్ఆర్ నిధుల కింద సుమారు రూ.70 లక్షల వ్యయంతో 105 మంది బాధితులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు స్థానిక మహిళా ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్తోపాటు ఈసీఐఎల్ ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు.


