News February 9, 2025
భువనగిరి: భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు

భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను కాజీపేట – ఖమ్మం – విజయవాడ మధ్య మూడో ట్రాక్ లైన్ పనుల కారణంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, ప్రజలు గమనించగలరని కోరారు.
Similar News
News November 19, 2025
గోదావరిఖని: మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు: సీపీ

నషా ముక్త్ భారత్లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ పిలుపునిచ్చారు. మంగళవారం రామగుండం కమీషనరేట్లో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News November 19, 2025
మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
News November 19, 2025
పెద్దపల్లి: అభయ హస్తం పథకానికి ఈనెల 21 వరకు గడువు.!

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ.లక్ష రూపాయల ప్రోత్సాహం కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం మంగళవారం ప్రకటించారు. అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.


