News February 9, 2025
భువనగిరి: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట – ఖమ్మం – విజయవాడ మధ్య మూడో ట్రాక్ లైన్ పనుల కారణంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, ప్రజలు గమనించగలరని కోరారు.
Similar News
News March 18, 2025
దేవనకొండ: శ్రీ గద్దరాల మారెమ్మవ్వ చరిత్ర

కర్నూలు జిల్లా దేవనకొండ మండల సమీపానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండల్లో వెలిసిన శ్రీ గద్దరాల మారమ్మ అవ్వ మూడేళ్లకొకసారి జరిగే ఊరు దేవురా కుంభోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనున్న పల్లె దొడ్డి గ్రామం నుంచి 101 కుంభాలతో గద్దరాల మారెమ్మవా దేవాలయం చేరుకునే సమయంలో అమ్మవారు గద్ద రూపంలో దేవాలయం వెనకాల ఉన్న కొండపై వాలి వెళ్లిపోతుందని అక్కడి గ్రామస్థులు పురాణాలు చెబుతున్నారు.
News March 18, 2025
రేపు, ఎల్లుండి జాగ్రత్త

AP: మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. రేపు 58 మండలాల్లో, ఎల్లుండి 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని <
News March 18, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*ఏలూరు జిల్లాలో ముగిసిన ఇంటర్ థియరీ పరీక్షలు
*శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
* పెదపాడు: MEO- టీచర్‌ను మందలించిన కలెక్టర్
*ఎంపీ కృషితో కుక్కునూరు- భద్రాచలం రోడ్డు పనులు ప్రారంభం
*నూజివీడు: పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు
*చింతలపూడి: బ్రిడ్జి కూలుతోందని యువకుల ధర్నా
*కామవరపుకోటలో బైక్ చోరీ
*అగిరిపల్లెలో షార్ట్ సర్క్యూట్.. కోళ్ల ఫారం దగ్ధం
*జీలుగుమిల్లిలో ఓ వ్యక్తిపై దాడి