News January 30, 2025
భువనగిరి: మహాత్మా గాంధీకి గుడి కట్టారు..

స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశానికి బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన మహాత్మా గాంధీకి చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో గుడి కట్టి పూజలు చేస్తున్నారు. మహాత్మా గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గుడిని నిర్మించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుని గురించి భావి తరాలకు తెలియాలనే ఉద్దేశంతో గుడి కట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కాగా నేడు గాంధీ వర్ధంతి.
Similar News
News November 26, 2025
సమీకృత వ్యవసాయ యూనిట్ను సందర్శించిన కలెక్టర్

లక్ష్మీదేవిపల్లి లోతువాగు గ్రామంలో పడిగ అపర్ణ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ యూనిట్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం సందర్శించారు. అవలంబిస్తున్న పద్ధతులు, మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కౌజు పిట్టలు, నాటు కోళ్లు, బాతులు, కొరమీను, మేకలు, కూరగాయలు, మునగ సాగు వివరాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీవో విద్యచందన పాల్గొన్నారు.
News November 26, 2025
400 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RITES 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి DEC 25వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PwBD, EWS వారికి రూ.300. వెబ్సైట్: https://rites.com *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 26, 2025
కామారెడ్డి జిల్లాలో రేపు కవిత పర్యటన

TG జాగృతి చీఫ్ కవిత రేపు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్, నిజాంసాగర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. బాన్సువాడలో సోషల్ వెల్ఫేర్ జూ.కళాశాలను సందర్శించి, నాగిరెడ్డిపేటలో ముంపు రైతులతో సమావేశం కానున్నారు. నాగన్న బావి, శబరిమాత ఆశ్రమాన్ని సందర్శిస్తారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులర్పించి, రైలు ప్రమాదంలో చనిపోయిన సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.


