News July 14, 2024

భువనగిరి: మహిళపై గొడ్డలితో దాడి

image

మహిళపై గొడ్డలితో దాడి చేసిన ఘటన నారాయణపురం(M) వాయిల్లపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన సుభాశ్‌ భూమి పక్కన చెన్నకేశవ, మారయ్య, లింగస్వామి, ఎర్రయ్యల భూమి ఉంది. కొద్ది రోజులుగా సుభాశ్ ఫెన్సింగ్ వేసుకున్న భూమిలో అర ఎకరం భూమి తమదంటూ గొడవ పడుతున్నారు. శనివారం ఫెన్సింగ్ కడ్డీలను ధ్వంసం చేసే సమయంలో సుభాశ్ భార్య అడ్డుకునేందుకు వెళ్లగా పద్మపై నలుగురు గొడ్డలితో దాడి చేశారు. కేసు నమోదైంది.

Similar News

News October 22, 2025

కొండమల్లేపల్లి: ఆదుకుంటే.. చదువుకుంటాం..

image

కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలైన సైదమ్మ-వెంకటయ్య కుమార్తెలు ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కూతురు తేజశ్రీకి రామగుండంలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఏడాది ఫీజు ₹ 1,22,000 కాగా, ఆమె అక్కకు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం ఫీజు ₹ 1,88,000 చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుతం కూలి పనులకు వెళ్తున్నారు. దాతలు ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

News October 22, 2025

నల్గొండ: ఉపాధి పనుల గుర్తింపునకు కసరత్తు

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నెల మొదటి వారం నుంచే గ్రామసభల ద్వారా పనులను గుర్తించాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆలస్యం ఏర్పడింది. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో వీటి నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఉపాధి పనుల గుర్తింపునకు ఈ గ్రామసభలను నిర్వహిస్తున్నారు.

News October 22, 2025

NLG: గడువు పెంచినా.. కానరాని జోరు!

image

నల్గొండ జిల్లాలో ఉన్న 154 ఏ4 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ టెండర్ల స్వీకరణ గడువు పొడిగించారు. కానీ ఆశావాహుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కేవలం 9 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండేళ్ల కిందట ఉన్న ఆసక్తి ప్రస్తుతం మద్యం వ్యాపారుల్లో కనిపించడం లేదని స్పష్టం అవుతుంది.