News April 5, 2025
భువనగిరి: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండలంలోని దయ్య బండ తండాలో కురిసిన అకాల వర్షాలకు వరి చేలు, మామిడి తోటలు, కూరగాయల పంటలు, మిర్చి తోటలు నష్టపోయిన పంటలను పరిశీలించారు. చేతి కొచ్చిన పంటలు నష్టపోవడంతో రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.
Similar News
News April 6, 2025
శ్రీరామ నవమి రోజునే రాముని కళ్యాణం ఎందుకంటే?

శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో జన్మించారు. ఆయన వివాహం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. అవతార పురుషులు జన్మించిన తిథి నాడే, ఆ నక్షత్రంలోనే వివాహం చేయాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. కాగా సీతాసమేతంగా శ్రీరాముడి పట్టాభిషేకం ఇదే రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
News April 6, 2025
HYD: శోభాయాత్ర.. ఈ రూట్లు బంద్!

శ్రీ రామనవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని HYD పోలీసులు తెలిపారు. సౌత్ వెస్ట్ జోన్లో 9AM నుంచి 4PM వరకు, ఈస్ట్ జోన్లో 2PM నుంచి 9PM వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. 20 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, MJ మార్కెట్, పుత్లీబౌలి మీదుగా సుల్తాన్బజార్కు ర్యాలీగా వెళ్తారు. ప్రత్యామ్నాయ రూట్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.SHARE IT
News April 6, 2025
కామారెడ్డి: రేపు కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లు ప్రారంభం

కామారెడ్డి జిల్లాలో కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను సోమవారం ప్రారంభించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటిని ఫార్చునర్ ద్వారా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజన్ పౌల్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.