News February 7, 2025

భువనగిరి: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గల ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల వివరాలిలా.. పోచంపల్లి మండలం జూలూరుకి చెందిన కేతం గోపాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదు. సికింద్రాబాద్ నుంచి విష్ణుపురం వైపు వెళ్లే ఆఫీసర్ స్పెషల్ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 7, 2025

భువనగిరి: వెటర్నరీ డాక్టర్‌పై అడవి దున్న దాడి 

image

యాదాద్రి జిల్లాలో కొన్ని రోజుల నుంచి అడవి దున్న హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో ప్రత్యక్షమవగా సాయంత్రం వలిగొండ శివారులో కనిపించింది. ఫారెస్ట్ అధికారులు దున్నను పట్టుకునే ప్రయత్నంలో చేయగా జూడా సజావుద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసినట్లు డీఎఫ్ఓ పద్మజారాణి తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించామన్నారు.

News February 7, 2025

సిరిసిల్ల: పొక్సో కేసులో ఇద్దరు యువకులకు రిమాండ్

image

బాలికల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట, నర్మాలకు చెందిన ఇద్దరు యువకులు చైల్డ్ ఫోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాలో సర్కులేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. యువకులను అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

News February 7, 2025

రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి నిన్న రాత్రి మృతిచెందాడు. క్రిష్ణగిరి(M) తొగిడిచెడుకు చెందిన పెద్ద గిడ్డయ్య, ఆయన భార్య ఈనెల 4న పొలం పనులకు వెళ్తుండగా.. అదే మార్గాన కొత్తూరుకు చెందిన శివ తొగిడిచెడుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురి బైక్‌లు ఢీకొన్నాయి. గిడ్డయ్యకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్థులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

error: Content is protected !!