News March 16, 2025
భువనగిరి: రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి

భువనగిరి శివారు రాయగిరి నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
RJY: 13న జాతీయ లోక్ అదాలత్

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె రాజమండ్రిలో మాట్లాడారు. త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సామాన్యులకు న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
News December 4, 2025
కాకినాడ: రాష్ట్రానికి పర్యాటకుల వెల్లువ

‘దేఖో అప్నా దేశ్’ స్ఫూర్తితో రాష్ట్రంలో పర్యాటక రంగం కళకళలాడుతోంది. 2024లో రికార్డు స్థాయిలో 29.2 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఎంపీ సానా సతీశ్ గురువారం పార్లమెంటులో ఆయన అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. పర్యాటక వృద్ధికి కేంద్రం తీసుకున్న చర్యలు దోహదపడ్డాయని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని మంత్రి తెలిపారు.
News December 4, 2025
కొయ్యలగూడెం RWS కార్యాలయంపై ACB దాడులు

కొయ్యలగూడెం ఆర్డబ్ల్యూఎస్ (RWS-రూరల్ వాటర్ సప్లై) కార్యాలయంలో ACB అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఓ కాంట్రాక్టర్ నుండి భారీ మొత్తంలో నగదు లంచం తీసుకుంటుండగా RWS శాఖకు చెందిన ఇరువురు అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


