News February 23, 2025
భువనగిరి: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ

భువనగిరి జిల్లాను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్ కావాలనే పరిస్థితి నుంచి కోడిమాంసం తెచ్చుకోవాలంటే జంకే స్థితికి ప్రజలు వచ్చారు. బాయిలర్ కోళ్లతోపాటు ఫారం కోళ్లు, నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. కాగా చౌటుప్పల్ మండల పరిధిలోని నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Similar News
News November 13, 2025
కరీంనగర్: నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి తెలిపారు. ఈ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద పరిహార వంటి కేసులు ఇరుపక్షాల రాజీతో పరిష్కరించబడతాయని చెప్పారు. రాజీపడదగిన వారు సంబంధిత పోలీసు వారిని సంప్రదించాలని ఆమె సూచించారు.
News November 13, 2025
ఆదిభట్లలో ఏసీబీ రైడ్.. అయిజలో కలకలం

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ ఆఫీస్‌లో గురువారం ఏసీబీ అధికారులు రైడ్ చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్‌ను పట్టుకున్నారు. అయితే అతడు అయిజ మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తూ ఆదిభట్ల, ఆమనగల్ మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ను ACB అధికారులు పట్టుకున్న వార్త అయిజలో కలకలం సృష్టించింది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ నడుస్తుంది.
News November 13, 2025
యాదాద్రి: బీసీల ధర్మ పోరాట దీక్షలో ప్రభుత్వ విప్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని అన్నారు. రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే భిక్ష కాదని అది మన హక్కు అని అన్నారు.


