News January 30, 2025

భువనగిరి: వాగులో జారిపడి దంపతులకు గాయాలు 

image

వాగు దాటుతుండగా జారి పడిపోవడంతో దంపతులకు గాయాలైన ఘటన ఆలేరులో జరిగింది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన సందెన రామనర్సయ్య, అతడి భార్య లక్ష్మి బైక్‌పై పోచన్న పేటలో తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో కొలనుపాక వాగు దాటుతుండగా జారి వాగులో పడిపోయారు. తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 22, 2025

26న ‘స్టూడెంట్ అసెంబ్లీ’.. వీక్షించనున్న సీఎం

image

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కొందరు స్పీకర్, Dy.స్పీకర్, CM, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని CM CBN, మంత్రులు వీక్షించనున్నారు.

News November 22, 2025

జనగామ: వైద్య ఆరోగ్య శాఖలో 7 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు

image

జనగామ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 7 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి 29, 2025 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500గా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులను సంబంధిత నిబంధనల మేరకు ఎంపిక చేయనున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దరఖాస్తులను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల వరకు పరిశీలిస్తారు.

News November 22, 2025

దక్షిణ మధ్య రైల్వేలో 61 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

సికింద్రాబాద్, దక్షిణ మధ్య రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో 61 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ITI, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. అంతర్జాతీయ క్రీడల్లో Jr, సీనియర్ విభాగాల్లో పతకాలు సాధించినవారు అర్హులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్రీడల్లో ప్రావీణ్యత, విద్యార్హత ఆధారంగా ఎంపిక చేస్తారు.